సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా సర్కారు వారి పాట టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. టీజర్ ఆన్ లైన్ లో అర్ధరాత్రి లీక్ కావడంతో సర్కారు వారి పాట మూవీ మేకర్స్ చెప్పిన సమయం కంటే ఎనిమిది గంటలు ముందుగానే టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే మహేష్ ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ గా కనిపిస్తారని గతంలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ టీజర్ ను బట్టి మహేష్ లోన్ రికవరీ ఆఫీసర్ గా కనిపిస్తారని అర్థమవుతోంది.
టీజర్ ఇన్ స్టంట్ హిట్ కావడంతో మేకర్స్ సైతం సంతోషిస్తున్నారు. మహేష్ విలన్ల దగ్గరకు వెళ్లి వడ్డీ కట్టకపోతే బ్యాండే అంటూ వార్నింగ్ ఇవ్వగా విదేశీ బ్యాంకులో ఉద్యోగి పాత్రలో మహేష్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. పోష్ లుక్స్ తో మహేష్ బాబు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మొదట ఈ సినిమా రివేంజ్ స్టోరీ అని ప్రచారం జరిగినా టీజర్ లో మాత్రం దర్శకుడు పరశురామ్ ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇచ్చారు.
సంక్రాంతి పండుగకు మహేష్ హీరోగా రిలీజైన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. కీర్తి సురేష్ సైతం సర్కారు వారి పాటలో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. టీజర్ తో మహేష్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కలర్ ఫుల్ విజువల్స్ సినిమాకు హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!