మహేష్ బాబు షూటింగ్ లో సందడి..!

  • January 27, 2021 / 08:48 AM IST

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తన తర్వాత ప్రాజెక్ట్ అయిన సర్కారి వారి పాట సినిమాని స్టార్ట్ చేసేశాడు. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా షూటింగ్ ఎట్టకేలకి దుబాయ్ లో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. నమ్రతా శిరోత్కర్ బర్త్ డే వేడుకలు, అలాగే సర్కార్ వారి పాట సినిమా షెడ్యూల్ రెండు కలిశొచ్చేలాగా ఈ ట్రిప్ ని ప్లాన్ చేశాడు ప్రిన్స్. ఇక దుబాయ్ లో షూటింగ్ హడావుడి స్టార్ట్ అయ్యిందట.

ఇక్కడ హీరో హీరోయిన్స్ పైన సరదా సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. షూటింగ్ లో హీరోయిన్ కీర్తిసురేష్ ఇంకా మహేష్ బాబులపై కొన్ని కామెడీ సీన్స్ ని తీస్తున్నారట. దీనితర్వాత దుబాయ్ లో కొన్ని ఛేజింగ్ సీన్స్ , అలాగే రెండు సాంగ్స్ కి కావాల్సిన వ్యూజువల్స్ ని కూడా తీయబోతున్నారని అంటున్నారు. సినిమా మొత్తం కరెన్సీ చుట్టూనే తిరుగుతుందని, ఇందులో భాగంగా దుబాయ్ లో తీసే సన్నివేశాలు కథలో కీలకంగా ఉంటాయని మూవీ టీమ్ నుంచి సమాచారం.

గీత గోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్ చేస్తున్న సినిమా, అలాగే సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీస్కుని మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు, డైరెక్టర్ పరుశురామ్ మహేష్ బాబు ఫ్యాన్ అవ్వడం , మహేష్ బాబు ఎలివేషన్ షాట్స్ మామూలుగా ఉండవు అని ఫ్యాన్స్ ని ఊరించడంతో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus