టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలియడంతోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించికోబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా కోసం రాజమౌళి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించబోతున్నారని ఈ సినిమా ఒక విజువల్ వండర్ లా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఇలాంటి అప్డేట్స్ తెలియడంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందిన వారందరూ కూడా ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలలో నటించలేదు.కానీ రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఈయన ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇలా ఈ స్థాయిలో (Mahesh) మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకునే ఈ 100 కోట్ల రెమ్యూనరేషన్ కూడా నిర్మాణంలో భాగం చేస్తూ ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాలలో వాటా తీసుకోబోతున్నారని సమాచారం.ఏది ఏమైనా ఈ సినిమా కోసం వంద కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు