ఫస్ట్ టైం మహేష్ అలా కనిపించనున్నాడట?

  • July 17, 2020 / 01:30 PM IST

బాలనటుడిగా డ్యూయల్ రోల్ చేసిన మహేష్ పూర్తి స్థాయి హీరోగా మారినాక అది ప్రయత్నించలేదు. హీరోగా 26 సినిమాలు చేసిన మహేష్ ఇంత వరకు డ్యూయల్ రోల్ చేయకపోవడం ఆశ్చర్య పరిచే అంశమే. ఈ జనరేషన్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఈ విషయంలో ముందున్నారు. ఆయన ఏకంగా ట్రిపుల్ రోల్ కూడా ట్రై చేశారు. కాగా మహేష్ కూడా తన నెక్స్ట్ మూవీలో డ్యూయల్ రోల్ కనిపించనున్నారనే ఓ ప్రచారం బయటికి వచ్చింది.

సర్కారు వారి పాట మూవీలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఓ పాత్రలో కన్నింగ్ నేచర్ తో నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటాడని, మరో పాత్ర క్లాస్ అండ్ సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుండో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తే చూడాలని ఎదురు చేస్తున్నారు. సర్కారు వారి పాట మూవీతో వారి కోరిక తీరనుందని సమాచారం. మరి ఇదే కనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి.

ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోని, లోపాలు మరియు బడా బాబుల దోపిడీలు వంటి విషయాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మహేష్ విలన్ కోసం కొందరు ప్రముఖ నటుల వేటలో చిత్ర బృందం ఉంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus