Guntur Karam: గుంటూరు కారం సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

సాధారణంగా కొన్ని సినిమాలు స్క్రిప్ట్ రాసే సమయంలోనే కొంతమంది హీరోలను సృష్టిలో పెట్టుకొని సినిమాలు రాస్తుంటారు. అయితే ఆ సినిమాలో ఆ హీరోలు కాకుండా వేరే హీరోల చేతికి వెళ్లి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో సదురు హీరో అభిమానులు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ విషయంలో ఫీలవుతున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదని మొదట ఈ సినిమా అవకాశం ఎన్టీఆర్ కు వచ్చిందని తెలుస్తుంది.

ఇలా ఈ సినిమా ఎన్టీఆర్ తో చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించి ఈ సినిమా కథను ఎన్టీఆర్ కి వినిపించారట. RRRసినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమాలోనే చేయాల్సి ఉంది. కథ మొత్తం విన్నటువంటి ఎన్టీఆర్ కథలో కొన్ని మార్పులు చెప్పడంతో త్రివిక్రమ్ కూడా అందుకు అనుకూలంగా కొన్ని మార్పులు చేశారట. అయినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ సాటిస్ ఫై కాకపోవడంతో ఈయన కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుకు అనుకూలంగా కొన్ని సన్నివేశాలను జోడించి ఈ కథ మహేష్ బాబుకి వినిపించడంతో మహేష్ బాబు ఈ సినిమాకి కమిట్ అయ్యారు. ఇలా గుంటూరు కారం సినిమాలో ముందుగా నటించాల్సిన హీరో మహేష్ బాబు కాదని ఎన్టీఆర్ అని తెలిసి ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాని వదులుకొని తారక్ తప్పు చేశారేమో అని భావిస్తున్నారు.

ఎందుకంటే (Guntur Karam) ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతంగా అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి గ్లింప్ సైతం అభిమానులకు పూనకాలు తెప్పిస్తుండడంతో తారక్ ఈ సినిమాని వదులుకొని తప్పు చేశారేమోనని అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus