నాగార్జున వల్ల మహేష్ వాట్సాప్ డీపీ బయటపడిందట..!

  • March 18, 2021 / 04:56 PM IST

మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా మిగిలిన హీరోల సినిమాల పై కూడా స్పందిస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ హీరోల ట్రైలర్లు విడుదలైతే.. అవి కనుక తనను ఆకట్టుకుంటే.. పర్సనల్ గా వాళ్లకు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి విషెస్ చెబుతుంటాడు. ఇటీవల నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ ను చూసిన మహేష్ తెగ ఇంప్రెస్ అయిపోయాడు. వెంటనే ట్రైలర్ బాగుంది అని నాగార్జునకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు.దానికి నాగార్జున థాంక్స్ చెబుతూ..

‘ఈ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యాలా?’ అని మహేష్ ను అడిగితే… దానికి మహేష్ ‘అఫ్ కోర్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. అంతే వెంటనే ఆ స్క్రీన్ షాట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు నాగ్. దాంతో బాలయ్య అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. అదేంటి? సీన్లోకి బాలయ్య అభిమానుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మేటర్ ఏంటంటే..

నాగార్జున పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ ను బట్టి మహేష్ వాట్సాప్ డీపి ఏంటన్నది.. బయటపడింది. గర్జిస్తున్న సింహం ఫోటోని తన వాట్సాప్ డీపిగా పెట్టుకున్నాడు మహేష్. సాధారణంగా సింహం అనగానే ఎక్కువగా బాలయ్య పేరే గుర్తుకొస్తుంది. సింహం టైటిల్ తో బాలయ్య సినిమాలు చాలానే వచ్చాయి. ‘సమరసింహారెడ్డి’ ‘నరసింహ నాయుడు’ ‘లక్ష్మీ నరసింహ’ ‘జై సింహా’ వంటి సూపర్ హిట్ సినిమాలు బాలయ్య నుండీ వచ్చాయి. అందుకే మహేష్ వాట్సాప్ డీపి చూసి బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉన్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus