ఆ సెంటిమెంట్ ను మహేష్ బాబు పక్కన పెట్టేసినట్టే..!

Advertisement

ఒకప్పుడు మహేష్ బాబుతో పనిచేసిన దర్శకులు అతనికి బ్లాక్ బస్టర్లు కనుక ఇస్తే.. మళ్ళీ ఆ దర్శకులతో వెంటనే సినిమాలు చెయ్యడానికి రెడీ అయిపోయేవాడు. ‘ఆల్రెడీ హిట్లిచ్చారు కదా’ అనే ఉద్దేశంతో గుడ్డిగా కథ కూడా వినకుండా లైన్ వినేసి వారికి ఛాన్స్ లు ఇచ్చేసేవాడు. ఫలితంగా ఎన్నో డిజాస్టర్లు కూడా మూటకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ పూర్తిగా మారిపోయాడు. కచ్చితంగా పూర్తి స్క్రిప్ట్ విని.. అది నచ్చితేనే డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడు.

ఆల్రెడీ హిట్టిచ్చిన దర్శకుడైనా సరే..వారి స్క్రిప్ట్ తో కనుక సంతృప్తి చెందకపోతే వారిని పక్కనపెట్టేస్తున్నాడు. సుకుమార్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్లను కూడా పక్కన పెట్టేస్తున్నాడు. సరే ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నాన్నంటే.. ఈరోజు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యబోతున్నట్టు మహేష్ కన్ఫర్మ్ చేసేసాడు. నిజానికి రాజమౌళితో మహేష్.. మరో రెండేళ్లలో కచ్చితంగా సినిమా చెయ్యడానికి రెడీ అవ్వాల్సి ఉంది. దానికి 2022 వరకూ టైం అనుకున్నా.. ‘సర్కారు వారి పాట’ చిత్రం పూర్తయ్యాక మహేష్ మరొక్క సినిమా మాత్రమే చెయ్యగలడు.

దానికోసం దర్శకుడు అనిల్ రావిపూడి వెయిటింగ్లో ఉన్నాడు. కానీ ఈరోజు ‘ఖలేజా’ విడుదలయ్యి 10ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో త్రివిక్రమ్ తో మూడో సినిమా చెయ్యబోతున్నట్టు మహేష్ కన్ఫర్మ్ చేసేసాడు. ఆ రకంగా చూస్తే తనకు ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి మహేష్ హ్యాండిచ్చేసినట్టే అని చెప్పాలి. అంతేకాదు అనిల్ వినిపించిన స్క్రిప్ట్ కూడా మహేష్ ను పూర్తిగా మెప్పించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా భోగట్టా..!

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus