పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా.. అప్పుడప్పుడు వారికిష్టమైన అంశాల్లో శిక్షణ ఇప్పిస్తే సృజనాత్మకతను వెలికితీసిన వారమవుతాం. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత. తమ ముద్దులు కూతురు సితారకు వివిధ అంశాల్లో తర్ఫీదు నిస్తున్నారు. నిన్న చెఫ్ వద్ద చాక్లెట్ ని తయారు చేయడం నేర్చుకున్న లిటిల్ ప్రిన్సెస్, నేడు మట్టితో కుస్తీ పట్టింది.
దీపావళికి కావాల్సిన ప్రమిదలను సొంతంగా తయారు చేసింది. సితార ప్రమిదలు చేసే వీడియోని నమ్రత నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సితార “ఎందుకు వీడియో తీస్తున్నారు” అని క్యూట్ గా మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంటోంది. మల్టీ ట్యాలెంటెడ్ బేబీ సితార అంటూ అభినందనలు అందుకుంటోంది. ఎన్ని పనులున్నా పేరెంట్స్ పిల్లలతో గడపాలని, వారికీ మంచి, చెడు చెప్పాలని.. అప్పుడే వారు సక్రమైన దారిలో ఎదుగుతారని వేదికలెక్కి చెప్పడానికే పరిమితం కాకుండా… సూపర్ స్టార్ మహేష్ దంపతులు తమ పిల్లల విషయంలో పాటిస్తున్నారు. స్ఫూర్తిగా నిలుస్తున్నారు.