అహ్మదాబాద్ లోని వీధుల్లో విలన్ ని వెంబడించిన సూపర్ స్టార్

  • November 29, 2016 / 12:21 PM IST

ఆయనొక సిన్సియర్ ఇంటెలిజన్స్ ఆఫీసర్. ప్రజల్ని, ప్రభుత్వాన్ని కన్నుగప్పి కోట్లు మింగిన అవినీతి పరుడిని పట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇది తెలిసిన ఆ దుర్మార్గుడు అధికారిని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అలసిపోని పోలీసాఫీసర్ విలన్ అంతు చూసేందుకు చెన్నై, హైదరాబాద్ లో వెంబడించారు. అనుచరులు దొరికారు అసలువాడు  అహ్మదాబాద్ కి పారిపోయాడు. అయినా హీరో వదల్లేదు… అక్కడి వెళ్లి వీధుల్లో ప్రాణాలకు తెగించి ఛేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది… సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా గురించి చెబుతున్నానని. మురగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న మూవీలో విలన్ గా ఎస్.జె. సూర్య నటిస్తున్నారు.

వీరిద్దరిపై మొన్నటి వరకు హైదరాబాద్ రోడ్లపై ఛేజ్ సీన్ చిత్రీకరించిన చిత్ర బృందం ఇప్పుడు గుజరాత్ కి వెళ్లింది. అక్కడి అందమైన నగరం అహ్మదాబాద్ లోని వీధుల్లో మహేష్ బాబు విలన్ అనుచరులను పట్టుకునే సీక్వెన్స్  ని సంతోష్ శివన్ తన కెమెరాలో బంధిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 23 వరకు కొనసాగుతుందని, అక్కడి ధర్మజ్, గాంధీనగర్ ప్రాంతాల్లో కీలక సీన్లు తెరకెక్కించనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు వెల్లడించారు. ఆ రాష్ట్ర పోలీసులు షూటింగ్ కి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని వివరించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus