మహేష్ భామ మత్తెక్కిస్తోంది..!

  • March 6, 2019 / 04:42 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కైరా అద్వానీ. బాలీవుడ్ క్రేజీ బ్యూటీలలో ఇప్పుడు కైరా టాప్ ప్లేస్ లో ఉంది. దీనికి అసలు కారణం పరిశీలిస్తే ఇప్పటికే దీపికా పడుకోణె, ప్రియాంక చోప్రా వంటి అగ్ర హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇక అలియా భట్, దిశా వంటి మిగతా బ్యూటీలు ప్రేమ వ్యవహారాలు నడుపుతూ రేపో.. మాపో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. దీంతో కైరా టాప్ ప్లేస్ దక్కించుకుంది.

ఇక కైరా.. తన క్రేజుకు తగ్గట్టే హాట్ ఫోటోషూట్లు చేస్తూ మరింత దూసుకుపోతుంది. ఇటీవల ‘ఎఫ్ హెచ్ ఎం’ మ్యాగజైన్ మార్చ్ ఎడిషన్ కవర్ పేజి కోసం హాట్ ఫోటో షూట్ చేసింది.ఇప్పుడు ఈ పిక్ వైరల్ గా మారింది. ఈ ఫొటోలో… పింక్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది కైరా. తన యద సౌష్టవాన్ని చూపిస్తూ కుర్రకారుని హీటెక్కిస్తోంది.ఈ ఫోటోకి తను ఫోజుకి… ఎక్సప్రెషన్ కి కుర్ర కారు ఫిదా అయిపోయారు.కైరా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోని పోస్ట్ చేసి గంటకే 1.3 లక్షల లైకులు రావడం విశేషం. ఇక ‘కబీర్ సింగ్’.. ‘కళంక్’.. ‘గుడ్ న్యూస్’ వంటి చిత్రాలలో నటిస్తూ కైరా ప్రస్తుతం బిజీగా గడుపుతుంది. వీటితో పాటూ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘కాంచన’ హిందీ రీమేక్ లో కూడా కైరా అద్వానీనే హీరోయిన్ గా అనుకుంటున్నారట. తెలుగులో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంతో పాటూ ‘మహేష్ 26’ కి కూడా కైరా పేరుని పరిశీలిస్తున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus