సూపర్ స్టార్ 24 వ మూవీకి ముహూర్తం కుదిరింది

  • November 5, 2016 / 12:23 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. శ్రీమంతుడు కాంబినేషన్లో  తెరకెక్కనున్నమూవీకి ముహూర్తం ఖరారు అయింది. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసే డైరక్టర్ కొరటాల శివ ప్రిన్స్ తో చేయనున్న రెండో సినిమా సెట్స్ మీదకు వెళ్ళేందుకు అంతా సిద్ధమైంది. సూపర్ స్టార్ ముఖ్యమంత్రిగా నటించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత మందిస్తున్న మహేష్ 24 వ ఫిల్మ్ ఈ నెల 9 న ప్రారంభం కానుంది. ఆ రోజు సినిమా షూటింగ్ ని లాంఛనంగా ప్రారంభిస్తారని దానయ్య సినీ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.

రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ఉంటుందని తెలిపారు.  ప్రస్తుతం మహేష్ బాబు ఏ.ఆర్. మురుగ దాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ ని డిసెంబర్ నాటికీ కంప్లీట్ చేయాలని మహేష్ శ్రమిస్తున్నారు. దీని తర్వాత కొరటాల దర్శకత్వంలో పనిచేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ కాంబినేషన్లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus