భర్త ఉండగానే.. ప్రియుడితో సరసాలు!

  • December 2, 2020 / 02:41 PM IST

బుల్లితెర నటి పవిత్ర పూనియా ప్రేమ కథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంట్లో భర్తతో సంసారం చేస్తూ మరోపక్క ప్రియుడితో ప్రేమాయణం సాగించింది. చివరికి ఈ విషయాన్ని ఇటు భర్త అటు ప్రియుడికి తెలియడం విషయం బయటకొచ్చింది. హోటల్ యజమాని సుమిత్ మహేశ్వరిని పెళ్లి చేసుకున్న పవిత్ర పూనియా.. బుల్లితెర నటుడు పరాస్ ఛబ్రాతో ప్రేమాయణాన్ని సాగించింది. ‘లవ్ యు జిందగీ’ తో కెరీర్ మొదలుపెట్టిన పవిత్ర ఆ తరువాత పాపులర్ సీరియల్స్ లో నటించి సెలబ్రిటీగా మారింది. పవిత్రతో వివాహ బంధంపై సుమిత్ తాజాగా వెల్లడించారు. తనను ఎలా మోసం చేసిందనే విషయాలను కూడా బయటపెట్టారు.

ఆయన మాట్లాడుతూ.. ”పవిత్రతో నాకు పెళ్లి జరిగిన తరువాత ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరింది. ఇదే సమయంలో నాతో కలిసి జీవితాన్ని పంచుకుంటూ, మరోవైపు బుల్లితెర నటుడు పరాస్ ఛబ్రాను ప్రేమించింది. వారిద్దరి మధ్య ప్రేమ గురించి తెలిసి షాక్ అయ్యాను. పవిత్రతో ప్రేమని కంటిన్యూ చేయొచ్చని.. అయితే విడాకులు వచ్చెనంత వరకు ఆగాలని అతనికి మెసేజ్ చేశాను. మేమిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమే. నా చేతిపై పవిత్ర టాటూ ఉంది. మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న హోటల్ లోనే పవిత్ర, పరాస్ ఉన్నారని తెలుసుకొని ఎంతో బాధపడ్డా. ఆమె ప్రేమలో నిజాయితీ లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సుమిత్.

ఇదిలా ఉండగా.. పవిత్ర ప్రియుడు పరాస్ ఛబ్రా కూడా ఆమె తీరుని తప్పుపట్టారు. పెళ్లైన మహిళ మరో వ్యక్తిని ప్రేమించడం, మోసం చేయడం తప్పని అన్నారు. పవిత్ర భర్త మెసేజ్ చేయడంతో తనకు నిజం తెలిసిందని అన్నారు. ఇదే విషయంపై పవిత్రని ప్రశ్నిస్తే ఆమె ఒప్పుకుందని అన్నారు. భర్తపై ప్రేమ లేకపోతే విడాకులు ఇచ్చి ఆ తరువాత తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండాలే కానీ అటు భర్త ఇటు ప్రియుడు ఇద్దరినీ మోసం చేయడం తప్పంటూ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus