Manchu Lakshmi: వైరల్ అవుతున్న మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisement

మంచు లక్ష్మి ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పాపులారిటీని సంపాదించుకున్నారు. పలు సినిమాలకు మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం మంచు లక్ష్మి స్కూళ్లను దత్తత తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలవగా ఆమె మంచితనానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మి మాట్లాడుతూ తాను హాలీవుడ్ యాక్టర్ నని చెప్పుకొచ్చారు.

హాలీవుడ్ ఇండస్ట్రీలో తాను కొన్ని కీలక ప్రాజెక్ట్ లలో నటించానని (Manchu Lakshmi) మంచు లక్ష్మి వెల్లడించారు. హాలీవుడ్ ఇండస్ట్రీలోనే నేను ఉంటే ఈపాటికి నేను స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునేదనినని మంచు లక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. పాప, కుటుంబం కొరకు నేను హాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమా ఆఫర్లు వస్తే మళ్లీ హాలీవుడ్ సినిమాలలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు దక్కవని మంచు లక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగమ్మాయిలు చాలామంది ఉన్నా వాళ్లకు ఇక్కడ అవకాశాలు దక్కడం లేదని మంచు లక్ష్మి కామెంట్లు చేయడం గమనార్హం. ఇక్కడ ప్రేక్షకులు సైతం ఇతర భాషల హీరోయిన్లను ఆదరిస్తున్నారని మంచు లక్ష్మి పేర్కొన్నారు. నాకు సొంతంగా నిర్మాణ సంస్థ ఉన్నా ఎంతమందికి సినిమా అవకాశాలు ఇవ్వగలనని ఆమె చెప్పుకొచ్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తీసుకొస్తే మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మి చేసిన కామెంట్ల గురించి ప్రముఖ దర్శకనిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మంచు లక్ష్మికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచు లక్ష్మిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read