విలక్షణ నటి తెగ బెదిరిస్తోంది.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో..!

  • March 29, 2022 / 06:01 PM IST

నిన్న వరల్డ్ థియేటర్ డే కావడంతో కొంతమంది పలువురు నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ అయ్యాయి. అందులో ఓ లేడీ విలన్.. మాష్టారు పాత్రలో బెత్తం చేత పట్టుకొని ఓ చిన్న పాపని మందలిస్తున్నట్టు.. ఫొటోకు ఫోజులివ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఆ ఫోటో చూడడానికి బ్లాక్‌ అండ్‌ వైట్లో ఉంది.అందులో ఉన్న లేడీ విలన్ ను ఈ పాటికే గుర్తుపట్టేసి ఉండొచ్చు కొంతమంది. ఒకప్పటి స్టార్ హీరో కమ్ విలక్షణ నటుడు అయిన మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు.

Click Here To Watch NOW

నిర్మాతగా, బుల్లితెర హోస్ట్ గా ఈమె బాగా పాపులర్ అయ్యింది. టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంలో ఈమె సిద్ధహస్తురాలు. తర్వాత మెల్లమెల్లగా నటిగా కూడా మారింది. ఈ క్రమంలో ఈమె చేసిన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం విజయవంతం కాకపోయినా ఈమె నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. అటు తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. విమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా ఈమె నటించడం జరిగింది. ట్యాలెంట్ ఉన్నప్పటికీ.. మంచి నటన కనపరుస్తున్నప్పటికీ ఎందుకో ఈమె స్టార్ నటిగా ముద్ర వేయించుకోలేకపోయింది.

‘బాహుబలి’ లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర.. ముందు ఈమెనే వెతుక్కుంటూ వచ్చింది. కానీ ప్రభాస్ కు తల్లిగా చేయడం ఇష్టంలేదని భావించి తప్పుకుంది. ఓ సందర్భంలో ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది. ఇక నిన్న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈమె పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. సినిమాలు రాకముందు నాటకాలకు మంచి గుర్తింపు ఉండేది. ఇప్పటిరోజుల్లో వాటి హవా తగ్గినా.. అవి అంతరించి పోలేదు.

బుల్లితెర పై ప్రసారమయ్యే షోల రూపంలో అవి బ్రతికే ఉన్నాయి. కాకపోతే వ్యంగ్యర్ధాలు, ద్వంద్వార్థాలు… ఉండడమే కొంతవరకు చింతించాల్సిన విషయం అంటూ కొన్ని విమర్శలు వీటికి ఎదురవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus