Manchu Lakshmi: మంచు లక్ష్మీ హీరోయిన్ గా రాణించకపోవడానికి కారణం అదేనట.. షాకింగ్ కామెంట్స్!

Advertisement

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచులక్ష్మి తక్కువ టైంలోనే ఫేమస్ అయిపోయింది. బుల్లితెర పై హోస్ట్‌గా టాక్ షోలకి పెద్ద పీట వేసింది మంచు లక్ష్మీనే.! ఆ తర్వాత విలన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టి తన తండ్రికి తగ్గ వారసురాలు అనిపించుకుంది. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘గుండెల్లో గోదారి’ ‘ఓ కొడతారా ఉలిక్కి పడతారా’ ‘దొంగాట’ ‘వైఫ్ ఆఫ్ రామ్’ వంటి మంచి సినిమాల్లో నటించింది.

తను మాట్లాడే విధానంపై ట్రోలింగ్ జరిగినప్పటికీ.. ఆ ట్రోల్ చేసే వారికి తెలీని మంచు లక్ష్మీ.. వేరే ఉంది. ఈమె ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసింది. అందుకే మంచు లక్ష్మీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో కంటే ముందు హాలీవుడ్లో పలు సినిమాల్లో నటించడం జరిగింది. ‘ అక్కడే ఉండుంటే ఈ 10 ఏళ్లలో ఎక్కడో ఉండేదాన్ని, ఇక్కడికి ఎందుకొచ్చానా అనిపిస్తుంది.

ఆ దేవుడు దయ తలిస్తే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లేందుకు నేను రెడీగా ఉన్నాను. తెలుగు ప్రేక్షకులు వేరే రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతారు. సొంత రాష్ట్రానికి చెందిన వారిని హీరోయిన్ గా ఆదరించరు. ఇక్కడి హీరోయిన్లని ఒక్క శాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారు.

ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం మానేయాల్సి వచ్చింది? బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని ఇలాంటి వాళ్ళు ఎందుకని సినిమాల్లో నటించడం లేదు? వీళ్లు ఎందులో తక్కువ? అందంతో పాటు టాలెంట్‌ ఉన్న వారే కదా?’’ అంటూ (Manchu Lakshmi) మంచు లక్ష్మీ తాజాగా చేసిన కామెంట్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read