‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మంచు లక్ష్మీ. ఆ తరువాత పలు చిత్రాలలో నటించి ఎంటర్టైన్ చేసింది. ‘చందమామ కథలు’ అనే నేషనల్ అవార్డు అందుకున్న సినిమాలో నటించింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఓ హీరోకి పెళ్లయిందని తెలియడంతో ఏడ్చేశానని చెప్పి షాకిచ్చింది మంచు లక్ష్మీ.
ఇంతకీ ఆ హీరో ఎవరంటే..? బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. మంచు లక్ష్మీ ఆయనకి పెద్ద ఫ్యాన్ అట. అయితే ఆయన పెళ్లి చేసుకున్నాడని తెలిసిన తరువాత చాలా బాధగా అనిపించిందని చెప్పిన ఈమె.. ఆమిర్ రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ఆమిర్ ఖాన్ సినిమాలను ఎన్నుకునే విధానం తనకు బాగా నచ్చుతుందని ఆమె తెలిపింది. ఇక తెలుగు హీరోల విషయానికొస్తే.. నాగార్జున తన ఫేవరెట్ హీరో అని చెప్పింది.
అందుకే ఎప్పుడైనా ఆమిర్, నాగార్జునల పేర్లు వింటే ఏదో అయిపోతుందని అంది. స్టార్ హీరోలపై మంచులక్ష్మీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచువారమ్మాయి దొరికితే ట్రోల్ చేయడానికి రెడీగా ఉండేవారు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ లను షేర్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?