పెళ్లిపై హింట్ ఇచ్చిన మంచు మనోజ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..

  • December 17, 2022 / 02:09 PM IST

టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ రెెండో పెళ్లి వార్త మీడియా, సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, దివంగత శోభా నాగి రెడ్డి జయంతి సందర్భంగా ఆమె పిల్లలు.. భూమా ఘాట్‌లో ఆమెకు నివాళులు అర్పించారు. అలానే పెద్ద కుమార్తె, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుమారుడు వీర నాగి రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలను.. భూమా అభిమానుల మధ్య అక్కడే జరుపుకున్నారు. అలాగే భూమా నాగ మౌనికతో కలిసి సినీ నటుడు మంచు మనోజ్ కూడా శోభా నాగిరెడ్డికి నివాళులర్పించారు.

వీరిని చూసేందుకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని భూమా ఘాట్‌‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. అనంతరం మనోజ్ కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, సినిమా జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. ‘చాలా కాలం నుంచి కడప దర్గాను దర్శించుకోవాలనుకుంటున్నా.. కడప దర్గాను దర్శించుకుంటే.. మంచి జరుగుతుందని.. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పారు.

కానీ ఇక్కడకు రావడానికి ఎందుకో చాలా సమయం పట్టింది. ఇన్నాళ్లకు.. ఇప్పుడు ఆ అల్లానే నన్ను ఇక్కడకు రప్పించారు. దర్గాకు రావడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంది. తర్వలోనే నేను నటించబోయే కొత్త సినిమా ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నాను. అలానే కొత్త జీవితంలోకి కూడా అడుగుపెడుతున్నా. మళ్లీ కుటుంబంతో కలిసి అమీన్ పీర్ దర్గాకు వస్తాను’’ అన్నారు. దీంతో మనోజ్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి..

‘కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను’ అన్నాడంటే.. త్వరలోనే మనోజ్‌.. రెండో వివాహం చేసుకోబోతున్నాడా?.. అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సికింద్రాబాద్ గణేష్ మండపానికి మనోజ్‌-మౌనిక కలిసి జంటగా వెళ్లి.. దేవుడిని దర్శనం చేసుకున్నారు. అప్పుడే వీరి పెళ్లిపై వార్తలు వచ్చాయి. తాజాగా మనోజ్ చేసిన వ్యాఖ్యలు వాటికి బలం చేకూర్చేలానే ఉన్నాయి.. త్వరలోనే తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus