మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టడానికి మంచు విష్ణు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ గురించి విష్ణు తరచూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా నాగబాబు విష్ణు గురించి తీవ్రస్థాయిలో కామెంట్లు చేయగా ఆ కామెంట్ల గురించి విష్ణు వేగంగా స్పందించారు. తన కుటుంబం గురించి కామెంట్లు చేసిన వాళ్లను జీవితంలో క్షమించనని విష్ణు అన్నారు. నాగబాబు “పవన్ కళ్యాణ్ కు కోపం వస్తే వార్ వన్ సైడ్ అవుతుంది” అని కామెంట్ చేశారని
ఆ డైలాగ్ ను తన సినిమాల్లో పెట్టుకుంటానని విష్ణు చెప్పుకొచ్చారు. తనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తెలుగు వ్యక్తి కాదని టాలీవుడ్ లో ఉండే సమస్యలను మేము పరిష్కరించుకోగలమని విష్ణు పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రకాష్ రాజ్ తనపై, తన ఫ్యామిలీపై ఎన్నో కామెంట్లు చేస్తున్నాడని ఇక్కడివాడు కాదు కాబట్టి క్షమించి వదిలేశానని విష్ణు తెలిపారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నానని ప్రకాష్ రాజ్ తన ఫ్యామిలీపై కామెంట్లు చేస్తే నేనేంటో చూపిస్తానని విష్ణు అన్నారు.
నాన్నకు, పవన్ కు మధ్య ఈగో ప్రాబ్లమ్స్ లేవని విష్ణు చెప్పుకొచ్చారు. వకీల్ సాబ్ సినిమా రిలీజైన సమయంలో పవన్ కు నాన్న ఫోన్ చేసి ప్రశంసించారని పవన్ నాన్న ప్రశంసించడం సంతోషంగా ఉందని చెప్పారని విష్ణు చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీ హీరోలు తనకు మంచి ఫ్రెండ్స్ అని విష్ణు కామెంట్లు చేయడం గమనార్హం.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు