‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో రూపొందిన మరో క్రేజీ మూవీ ‘మంగళవారం’. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.72 cr |
సీడెడ్ | 0.36 cr |
ఉత్తరాంధ్ర | 0.27 cr |
ఈస్ట్ | 0.16 cr |
వెస్ట్ | 0.10 cr |
గుంటూరు | 0.16 cr |
కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.91 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.25 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 2.16 cr |
‘మంగళవారం’ (Mangalavaaram) చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12.5 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.2.16 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.10.34 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
వరల్డ్ కప్ మ్యాచ్ ల వల్ల .. ఆదివారం కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి ప్రభావం లేకపోతే..’మంగళవారం’ వీకెండ్ కి బాక్సాఫీస్ వద్ద 70 శాతం రికవరీ సాధించే అవకాశం ఉంది.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!