సూపర్ స్టార్ తో సినిమా అంటే అంత ఈజీ కాదు!

  • November 9, 2020 / 05:32 PM IST

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులకి హీరోయిన్ అవ్వాలని కోరిక. కానీ కృష్ణ అభిమానులకు ఈ విషయం నచ్చక నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో మంజుల ఆగిపోవాల్సి వచ్చింది. హీరోయిన్ గా కాకపోయినా ‘షో’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాను ప్రొడ్యూస్ కూడా చేసి జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాలు, నిర్మాతగా కొన్ని సినిమాలు తీసింది. చివరిగా ఆమె మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాను రూపొందించింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మంజుల సినిమాల వైపు చూడలేదు.

కానీ ఇప్పటికీ ఆమెకి దర్శకత్వ కలలు ఉన్నాయట. మళ్లీ ఓ సినిమా చేస్తానని.. అన్నీ కుదిరితే తన దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా చేస్తానని వెల్లడించింది. మంజులకి మహేష్ సొంత తమ్ముడే అయినప్పటికీ టాలీవుడ్ లో ఆయనొక సూపర్ స్టార్. ఆయనతో సినిమా చేయడమంటే అంత ఈజీ కాదు. ముందు మంజుల దర్శకురాలిగా తనను తాను నిరూపించుకోవాలి. ‘మనసుకు నచ్చింది’ లాంటి సినిమా తీసిన మంజులకు మహేష్ కి ఛాన్స్ ఇస్తాడని అనుకోలేం.

ఈ విషయం మంజులకు కూడా అర్ధమైనట్లు ఉంది. అందుకే ముందుగా ఓ మంచి సినిమా తీసిన హిట్ అందుకొని ఆ తరువాత మహేష్ దగ్గరకు వెళ్తానని చెప్పింది. ‘మనసుకు నచ్చింది’ సినిమా గనుక హిట్ అయి ఉంటే.. తన జర్నీ మరోలా ఉండేదని.. మహేష్ కూడా సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చేవాడంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus