Maruthi Nagar Subramanyam Collections: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 1, 2024 / 12:25 PM IST

రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య (Lakshman Karya) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'(Maruthi Nagar Subramanyam). స్టార్ దర్శకుడు సుకుమార్ (Sukumar) సతీమణి తబిత సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి అల్లు అర్జున్ (Allu Arjun) కూడా కొంత ప్రమోట్ చేయడం జరిగింది. ఆగస్టు 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. రావు రమేష్ మార్క్ కామెడీకి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.

Maruthi Nagar Subramanyam Collections:

కానీ తర్వాత డౌన్ అయిపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.55 cr
సీడెడ్ 0.18 cr
ఆంధ్ర(టోటల్) 0.42 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.17 cr
ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.47 cr

‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ చిత్రానికి రూ.2.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కి రూ.2.8 కోట్లు వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రానికి రూ.1.47 కోట్ల షేర్ వచ్చింది. ఫైనల్ గా రూ.1.33 కోట్ల నష్టాలతో ప్లాప్ గా మిగిలిపోయింది ఈ చిత్రం.

షాక్ ఇస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus