మహేష్ ఫ్యాన్ కామెంట్ పై మసూద బ్యూటీ రియాక్షన్ ఇదే!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా ఒక్క సినిమాలో నటించినా చాలని చాలామంది హీరోయిన్లు భావిస్తారు. మహేష్ బాబు వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. మహేష్ సినిమాలకు ఇతర భాషల్లో కూడా ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. యాడ్స్ ద్వారా మహేష్ బాబు ఇతర భాషల ప్రేక్షకులకు పదేళ్ల క్రితమే దగ్గరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ఏదనే ప్రశ్నకు మసూద మూవీ పేరు సమాధానంగా వినిపిస్తుంది.

ఈ సినిమాలో నటించిన బాంధవి శ్రీధర్ కు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో మసూద మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో మహేష్, బాంధవి శ్రీధర్ కాంబో చూడాలని ఉందని పేర్కొన్నారు. ఈ కామెంట్ ను చూసిన బాంధవి శ్రీధర్ స్పందిస్తూ “అత్యాశ అనుకోండి.. అంటే అన్నారు కానీ ఆ ఊహెంత బాగుందో” అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ ను తమ జీవితంలో రియల్ గా ఒక్కసారైనా చూడాలని సాధారణ అమ్మాయిలు కలలు కంటుండగా హీరోయిన్లు మాత్రం మహేష్ తో ఒక్క సీన్ చేసినా తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మహేష్ బాబు, బాంధవి కాంబినేషన్ లో సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది. ఈ జోడీ బాగుంటుందని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు వచ్చే ఏడాది త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus