Ravi Teja, Chiranjeevi: రవితేజ ఎంట్రీ ఇచ్చాడు..మెగా మాస్ కాంబో షురూ!

  • July 16, 2022 / 05:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో ఓ క్రేజీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మెగా 154’ వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు మొదలు కాబోతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

తర్వాత రవితేజ తప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే దీని పై క్లారిటీ ఇస్తూ చిత్ర బృందం తాజాగా ఓ వీడియో ని విడుదల చేసింది. ఈ వీడియోలో రవితేజ తన కారులో నుండి దిగి సెట్‌లోకి అడుగుపెడుతున్నట్టు, ఆ తర్వాత కారవాన్‌ తలుపుతట్టి చిరుతో చెయ్యి కలిపి లోపలికి వెళ్తున్నట్టు ఉంది. అభిమానులను ఖుషి చేసే విధంగా ఈ వీడియో ఉందని చెప్పొచ్చు. రవితేజ ఈ ప్రాజెక్టులో జాయిన్ అవ్వడంతో మరింత ఆకర్షణ చేకూరే అవకాశం ఉందని చెప్పొచ్చు.

గతంలో రవితేజ.. ‘అన్నయ్య’ ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. వీడియో చివర్లో “మెగా మాస్ కాంబో బిగిన్స్” అంటూ బాబీ చెప్పడం కూడా మంచి హై ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే విభాగానికి పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ఆల్రెడీ చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!


రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus