Matti Kusthi Collections: ‘మట్టి కుస్తీ’ తెలుగులో ప్లాప్ గా మిగిలింది..!

  • December 17, 2022 / 08:02 PM IST

కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ. ‘ఆర్ టీ టీమ్ వర్క్స్’, ‘విష్ణు విశాల్ స్టూడియోస్’ బ్యానర్లపై మాస్ మహారాజ్ రవితేజతో కలిసి విష్ణు విశాల్,శుభ్రా,ఆర్యన్ రమేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.భార్యా భర్తల మధ్య అనుబంధం అలాగే రెజ్లింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. డిసెంబర్ 2న ఈ మూవీ తమిళ్ తో పాటు మలయాళం, తెలుగు భాషల్లో కూడా ఏకకాలంలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెలుగులో ఈ సినిమా పై ఓ మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ వరకు ఓకే అనిపించింది ఈ మూవీ.కానీ తర్వాత నిలబడలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 0.31 cr
సీడెడ్ 0.18 cr
ఆంధ్ర 0.29 cr
ఏపీ +తెలంగాణ 0.78 cr

‘మట్టీ కుస్తీ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.9 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.0.78 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘హిట్ 2’, ‘లవ్ టుడే’, ‘మసూద’ హిట్ వంటి సినిమాల పోటీ వల్ల ఈ మూవీ ఇక్కడ నిలబడలేక పెద్ద ప్లాప్ గా మిగిలింది అని చెప్పాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus