హద్దులు దాటిన మీడియా.. నటుడు ఫైర్!

హిందీ బిగ్ బాస్ ఫేమ్, బాలీవుడ్ టీవీ నటుడు కరణ్ కుంద్రా మీడియాపై ఫైర్ అయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్, బిగ్ బాస్ విన్నర్ తేజస్వి ప్రకాష్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించినా మీడియాపై అతడు ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో మీడియా వ్యక్తులు ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కరణ్ కుంద్రా వారికి క్లాస్ పీకుతూ ప్రియురాలు తేజస్వికి మీడియాతో క్షమాపణలు చెప్పించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Click Here To Watch NOW

తేజస్వి ప్రకాష్.. బిగ్ బాస్ 15 విజేతగా టైటిల్ గెలుచుకొని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకి ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నాగిన్ 6లో లీడ్ రోల్ ఛాన్స్ ఇచ్చింది. బిగ్ బాస్, నాగిన్ సీరియల్ తో తేజస్వి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడ కనిపించినా.. మీడియా తమ కెమెరాలకు పని చెబుతూ ఆమెను ఫొటోలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె ఇంటి ముందు ఫొటోలు తీస్తుండగా.. వెంటనే తేజస్వి ఇంట్లోకి వెళ్లిపోయింది.

ఆమెను ఫాలో అవుతూ.. ఇంట్లో వెళ్లేందుకు ప్రయత్నించారు ఫొటోగ్రాఫర్లు. అంతేకాకుండా.. తమ ఫొటోలకు పోజులివ్వాలంటూ తేజస్విని ఇబ్బంది పెట్టారు. దీంతో కరణ్ కుంద్రా వారిపై ఫైర్ అయ్యాడు. ఇలా ఇంట్లోకి చొరబడి ఫొటోలు తీయడం పద్ధతి కాదని.. అనుమతో లేకుండా ఓ అమ్మాయి ఇంట్లోకి ఎలా చొరబడతారంటూ కోప్పడ్డాడు. సెలబ్రిటీలకు కూడా పెర్సనల్ లైఫ్ ఉంటుందని.. వారి ప్రైవసీకి ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదని అన్నారు. అసలు ఇంటి వరకు వచ్చి ఫొటోలు తీయడం ఏంటని ప్రశ్నించారు.

మరోసారి ఇలా చేస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తూ మీడియాతో తన గర్ల్ ఫ్రెండ్ కి సారీ చెప్పించాడు. కరణ్, తేజస్వి బిగ్ బాస్ హౌస్ లో కలుసుకున్నారు. ఆ పరిచయమే ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ముంబైలో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus