Upasana, Lavanya: సున్నండల పోస్ట్‌ చుట్టూ… కొణిదెల కోడళ్ల కామెంట్లు… ఏమైందంటే?

  • January 16, 2024 / 11:35 AM IST

మెగా ఫ్యామిలీలో ఎవరు ఎక్కడ ఉన్నా… సంక్రాంతి సమయానికి మాత్రం మొత్తం బెంగళూరు వెళ్లిపోవాల్సిందే. ఈ మాట మేం అనడం లేదు. ఏటా జరిగేది ఇదే. ఇదే విషయాన్ని మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ కొందరు గతంలో చెప్పారు కూడా. అనుకున్నట్లుగానే మెగా ఫ్యామిలీ ఇప్పుడు బెంగళూరులో చిరంజీవి ఫామ్‌ హౌస్‌లో సరదాగా గడుపుతున్నారు. వండుకుంటూ, వండించుకుంటూ సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు దీనికి అదనం.

బెంగళూరులో ఏం జరుగుతోంది, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది కూడా. ఆమెతోపాటు నిహారిక, సుస్మిత తదితరులు కూడా షేర్‌ చేస్తున్నారు. అయితే కొత్త కోడలు లావణ్య కూడా ఇదే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పెద్ద కోడలు, కొత్త కోడలు మధ్య సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సంక్రాంతి సెలబ్రేషన్స్‌ కోసం చిరంజీవి – అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నట్లు తొలుత ఫొటోలు షేర్‌ చేశారు కొణిదెల కోడళ్లు. డెకరేషన్‌, భోజనం, స్నాక్స్‌ – కాఫీ టైమ్‌, మెహందీ, యోగా టైమ్‌ అంటూ వీడియోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు. అలా లావణ్య త్రిపాఠి గురించి ఓ పోస్ట్‌ పెడుతూ ‘‘కొత్త కోడలు అందరి కోసం సున్నుండలు చేస్తోంది. టూ స్వీట్‌ కదా’’ అని రాసుకొచ్చింది. ఆ పోస్టుకు (Lavanya) లావణ్య ‘‘థ్యాంక్యూ.. సూపర్‌ స్వీట్‌ పెద్ద కోడలు’’ అని రాసింది.

పైన చెప్పినట్లు చిరంజీవి కుటుంబం ఏటా సంక్రాంతిని వేడుకగా చేసుకుంటుంది. కుటుంబానికి చెందిన హీరోలందరూ షూట్స్‌ నుండి బ్రేక్‌ తీసుకుని వేడుకకు హాజరవుతారు. అయితే వరుణ్‌ తేజ్‌ – లావణ్య వివాహం, క్లీంకార పుట్టిన తర్వాత తొలి సంక్రాంతి కావడంతో ఈసారి సెలబ్రేషన్స్‌ మరింత స్పెషల్‌ అట. పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌, కుమార్తె ఆద్య కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus