సాధారణంగా చిన్న పిల్లలో లేదా ఏదైనా ఫ్యామిలీ మీటింగ్స్ అప్పుడో పెద్దలు సరదా కోసం మ్యూజికల్ చైర్స్ ఆడుతుంటారు. ఒక కుర్చీ కోసం ఇద్దరు ముగ్గురు ఆడే ఆట మ్యూజికల్ చైర్స్. ప్రస్తుతం మెగా హీరోలు కూడా ఈ మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడుతున్నారు, అయితే వాళ్ళు ఆడుతున్నది మాత్రం కుర్చీ కోసం కాదు ఓ క్రేజీ ప్రొజెక్ట్ కోసం. “పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్” వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకొన్న అనిల్ రావిపూడి తన నాలుగో చిత్రంగా ఓ మల్టీస్టారర్ ప్రొజెక్ట్ ను సెట్ చేసుకొన్న విషయం తెలిసిందే.
వెంకటేష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో మరో కథానాయకుడిగా తొలుత సాయిధరమ్ తేజ్ ను అనుకొన్నారు. అనిల్ రావిపూడితో సాయిధరమ్ తేజ్ ఆల్రెడీ “సుప్రీం” సినిమాలో నటించి ఉండడంతో వారిద్దరికీ మంచి ర్యాపో కూడా ఉండడంతో వెంకీ సినిమాలోనూ అనిల్ ముందు సాయిధరమ్ తేజ్ నే అనుకొన్నాడు. కానీ.. కారణాంతరాల వలన ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ప్లేస్ లో వరుణ్ తేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ మ్యూజికల్ చైర్స్ గేమ్ ఇక్కడితో ఆగుతుందో లేక వరుణ్ తేజ్ ప్లేస్ లోకి ఇంకో మెగా హీరో మారతాడో చూడాలి.