Chiranjeevi: గాడ్ ఫాదర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్?

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి పొలిటికల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్ లూసీ ఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. చాలాకాలం తర్వాత మెగాస్టార్ కి బ్లాక్ బస్టర్ పడటంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహిస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు ముఖ్యంగా ఇందులో నటించిన నటీనటుల గురించి ఈయన పలు విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి తండ్రిగా నటించిన సర్వదామన్ బెనర్జీ ఇందులో ముఖ్యమంత్రిగా నటించారు ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ గా సరిపోతారని భావించారు. ఇక పూరి జగన్నాథ్ ముందుగా ఈ పాత్రలో నేను చేయనని అన్నారు చివరికి ఈ పాత్రలో చేయడానికి ఒప్పుకున్నారు.

ఇక ఈ సినిమాకు నయనతార ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇందులో నయనతార నటన ఎంతో అద్భుతంగా ఉందని మెగాస్టార్ ఆమె పాత్రపై అంశాల కురిపించారు. ఎంతో ప్రతిభ కలిగిన సత్యదేవ్ కిఈ పాత్ర చేయమని తానే అడిగాను ఇలా నేను అడిగేసరికి సత్యదేవ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మీరు అడిగితే కాదంటానా అంటూ ఈ పాత్రలో నటించారని తెలిపారు.ఇక నాకు సేనాపతిగా కనిపించే పాత్రలో సల్మాన్ ఖాన్ ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ పాత్రలో సల్మాన్ అయితేనే బాగుంటుందని డైరెక్టర్ చెప్పడంతో చరణ్ ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి ఒప్పించారని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు.ఇక మాపై ఉన్న ప్రేమతో సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించడానికి కాదనలేకపోయారని ఆయన పాత్ర కూడా ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయిందంటూ చిరంజీవి ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి ఈ సమావేశంలో ముచ్చటించారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus