టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రెండు శుభవార్తలు చెప్పారు. పెద్ద కూతురు సుస్మిత బ్యానర్ లో ఒక సినిమాకు, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చిరంజీవి ఒకేరోజు రెండు ప్రాజెక్ట్ లను ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం ఒకింత భారీ రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి.
అయితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కావడం గమనార్హం. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. చిరంజీవి 156 సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా బ్రో డాడీ సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
బంగార్రాజు తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా కోసం పని చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వస్తే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి తన సినిమాలలో మరో యంగ్ హీరో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాతే మరికొన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.
భారీ బడ్జెట్ సినిమాలకు చిరంజీవి (Chiranjeevi) ప్రాధాన్యత ఇస్తున్నారు. భోళా శంకర్ హిందీ వెర్షన్ ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. చిరంజీవి పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్