నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి… అలా ఉండాలి అంటూ అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో లెక్క ఉంటుంది. అయితే ఎవరేం చెప్పినా… హీరోయిన్లు చెప్పిన మాట ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు సెలబ్రిటీలు మరి. అలా ఓ సినిమా నాయిక తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది. ఆమెనే యువ కథానాయిక మేఘ ఆకాశ్.
‘రాజ రాజ చోర’ సినిమాతో ఇటీవల మంచి విజయం అందుకుంది మేఘ ఆకాశ్. కెరీర్‌లో ఇదే మంచి విజయం అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ‘డియర్ మేఘ’ అనే మరో ప్రేమకథలో నటిస్తోంది. ఈ సినిమా కథ చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. ప్రేమలో ఉండే స్ట్రగుల్స్‌ను ఈ సినిమాలో చక్కగా చూపించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వరుసగా ప్రేమ నాయిక పాత్రలు చేస్తున్నారు… మరి నిజ జీవితంలో… అంటే ఇలా చెప్పుకొచ్చింది.
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. అలాగే నా జీవితంలోనూ ఉంది అంటూ గతానికి వెళ్లిపోయింది మేఘ. నాలుగో తరగతి చదువు తుండగా ఆమె పక్కన కూర్చునే అబ్బాయిపై ఇష్టం ఏర్పడిందట. అదే ఆమె తొలి ప్రేమట. ఆ తర్వాత చదువు అయిపోయింది. కొన్ని రోజులకు ఆమెకు షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడిందట. అంతేకాదు ఆమె ప్రేమ వివాహాన్నే ఇష్టపడుతుందట. మరి పార్టనర్ సంగతో అంటే… ‘నాకు కాబోయే భాగస్వామి నన్ను నాలా ఉండనివ్వాలి’ అని చెప్పింది మేఘ.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!