ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని వివాహ బంధంలోకి ఎంటర్ అవుతున్నారు. హీరోలు పెళ్లి తరువాత కూడా తమ కెరీర్ ని కంటిన్యూ చేయగలరు కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. పెళ్లి కాగానే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు. కొందరు సినిమాల్లో కొనసాగాలని అనుకున్నా.. ఇండస్ట్రీ నుండి పెద్దగా సపోర్ట్ ఉండేది కాదు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. పెళ్లి తరువాత కూడా చాలా మంది సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
కరీనా కపూర్, దీపికా పదుకోన్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లతో పాటు సమంత, శ్రియ, కాజల్ లాంటి హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీరి స్ఫూర్తితి టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కూడా పెళ్లి తరువాత సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకుంది. ఆమె రాజకీయనాయకుడైన భవ్య బిష్ణోయ్ తో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ బాగా సాగుతున్న సమయంలో పెళ్లేంటి అని చాలా మంది అనుకున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం పెళ్లికి ఇదే కరెక్ట్ టైమ్ అని అనుకుంది.
పొలిటికల్ ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్తుండడంతో ఆమె ఇక సినిమాలు చేయదేమో అనుకున్నారు. అయితే ఈ సందేహాలకు తెరదించుతూ.. తాను పెళ్లి తరువాత కూడా సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించింది మెహ్రీన్. దానికి తన భర్త నుండి ఎలాంటి అభ్యంతరాలు లేవని.. వ్యక్తిగత-వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తాననని స్పష్టం చేసింది. కొద్దిరోజుల్లో భవ్య బిష్ణోయ్ తో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్నట్లు వెల్లడించింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!