Mehreen: మెహ్రీన్ ఇలా మారిపోయిందేంటి..వైరల్ అవుతున్న మెహ్రీన్ కొత్త లుక్..!

  • May 5, 2023 / 11:14 AM IST

ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్ లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల వి షయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మెహ్రీన్. తొలి సినిమాతోనే అందం..

అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంతగా హిట్టు కాలేదు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకనిర్మాతలు ఎక్కువగా పట్టించుకోలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ మాత్రమే కాదు.. కాసింత అదృష్టం ఉండాల్సిందే. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని… ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ.. ఎప్పటికప్పుడు నెట్టింట అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యేందుకు తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

చేసిందీ తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ మెహ్రీన్. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఈ అమ్మాడికి మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. చివరిసారిగా మెహ్రీన్ ఎఫ్ 3 చిత్రంలో కనిపించింది.ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహ్రీన్ తన ఫిట్ నెస్ పై బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఎప్పుడూ బొద్దుగా కనిపించిన మెహ్రీన్ (Mehreen) ఇప్పుడు బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్ కు వచ్చేసింది. తాజాగా తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త వైరలవుతున్నాయి. మెహ్రీన్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మెహ్రీన్‌కు ఏమైంది ?… ఎందుకు ఇంతగా మారిపోయింది ?.. బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


v

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus