Pushpa 2: ప్రశాంత్ నీల్ దారిలో పయనిస్తున్న సుకుమార్.. ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదా?

2024 సంవత్సరంలో రిలీజ్ కానున్న సినిమాలలో పుష్ప2 సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. అయితే సుకుమార్ ప్రేక్షకులకు మరో షాకింగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారని పుష్ప2 సినిమాకు సీక్వెల్ గా పుష్ప3 మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. పుష్ప3 సినిమా కూడా సెట్స్ పైకి వెళితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

పుష్ప3 సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. 2024 సంవత్సరం మే సమయానికి పుష్ప2 సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రశాంత్ నీల్ దారిలో పయనిస్తున్న సుకుమార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ లా పుష్ప సిరీస్ ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పుష్ప సిరీస్ కు హిందీలో సైతం భారీ స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.

పుష్ప1 సినిమా 360 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా పుష్ప2 సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. పుష్ప2 సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ ఎంతో కష్టపడ్డారు. మొదట తయారు చేసిన స్క్రిప్ట్ లో ఎన్నో మార్పులు చేశారు. పుష్ప2 సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. రష్మిక కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని చెప్పవచ్చు.

అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను సైతం భారీ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. పుష్ప2 సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. భాషతో సంబంధం లేకుండా పుష్ప2 సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus