ఫైనల్ గా మోహన్ బాబే ఒప్పేసుకున్నాడు..!

దర్శకరత్న దాసరి నారాయణ రావు తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరు ఇప్పటికే గుర్తుపెట్టుకోవాల్సిందే. వరుసగా 15 హిట్లిచ్చిన ఏకైక డైరెక్టర్ దాసరి. ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేదు. రాఘవేంద్ర రావు లాంటి డైరెక్టర్లు ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఇదిలా ఉండగా అయన మ‌ర‌ణించి రెండేళ్ళు గడుస్తుంది. కానీ ఆయ‌న ఆస్తుల పంపకం విషయంలో ఇంకా కొన్ని వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. ఆయనకి ముగ్గురు సంతానం. ప్ర‌భు, అరుణ్‌, హేమాల‌య కుమారి. అయితే అయన థన్ ఆస్తులకి సంబందించిన వీలునామాలో ఆస్తుల్ని ఎవ‌రెవ‌రికి పంచాలనేది క్లారిటీ గా రాయలేదంట.

దీంతో ఈ బాధ్య‌త‌ని మోహ‌న్‌బాబు, ముర‌ళీమోహ‌న్‌ల‌కు అప్పగించారట. దాసరి గారికి అత్యంత సన్నిహితులు కావడంతో వీరికి ఆ బాధ్యతని అప్పగించారు. ఇక దాసరి మరణించిన సంవత్సారానికే వీరు ఆయనకు సంబందించిన ఆస్తుల్ని.. దాసరి సంతానమైన ముగ్గురికీ పంచారు. అయితే ఇక్కడ దాసరి కుమార్తె అయిన హిమాలయకు మాత్రం కొంత అన్యాయం జరిగిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఆమె మోహన్ బాబు పై విమర్శలు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

తన గురువు దాసరి ఆయనకి అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేదని మోహన్ బాబు కూడా తాజాగా వెల్లడించాడు. దాసరి గారు బ్రతికున్నపుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా అని వీలునామా రాయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదంట. అన్నీ ఎలా ఉన్నా కానీ.. దాస‌రికి జూబ్లీహిల్స్ ఓ ఖ‌రీదైన బంగ్లా ఉందట. అంతేకాదు హైద‌రాబాద్ శివార్ల‌లో కోట్లు విలువ చేసే ఫామ్‌హౌస్, కొన్ని స్థలాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. వీటి గురించే… వార‌సుల మ‌ధ్య గొడ‌వ‌లు త‌లెత్తాయని సమాచారం. ఏదేమైనా దాసరి కూతురు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు మాత్రం స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus