సర్కారు వారి ‘పాట’లో బిగ్‌బాస్‌ అందం ఉందా?

  • February 4, 2021 / 10:48 AM IST

బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్‌ చాలా బిజీ అయిపోయింది. వచ్చీ రాగానే ‘అల్లుడు అదుర్స్‌’లో ఓ పాటకు చిందేసింది. ఆ తర్వాత పాటల కార్యక్రమానికి జడ్జి అయిపోయింది. ఇక అమ్మడి జోరు మామూలుగా ఉండదు అని అందరూ అనుకునర్నారు. ఈలోగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో మోనాల్‌ ఓ పాటలో కనిపించబోతోంది అని వార్తలు వచ్చాయి. దీంతో మోనాలా మజాకా అని అందరూ అనుకున్నారు. అయితే అదంతా తూచ్‌ అంటోంది బిగ్‌బాస్‌ ‘నర్మద’.

‘సర్కారు వారి పాట’ సినిమాలో మీరు మహేష్‌బాబుతో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నారట కదా అని మోనాల్‌ని అడిగితే… ‘అలాంటిదేం లేదే’ అంటూ గాలి తీసేసింది. ‘సర్కారువారి పాట’లో ఓ ప్రత్యేక గీతం కోసం చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది కూడా. అయితే అవన్నీ నిజం కాదని చెప్పేసింది మోనాల్‌. దీంతో సూపర్‌ స్టార్‌ సరసన బిగ్‌బాస్‌ స్టార్‌ను చూసే అవకాశం అభిమానులకు మిస్‌ అయ్యింది.

మోనాల్‌ ప్రస్తుత జోరు చూస్తుంటే… ఈ అవకాశం మిస్‌ అయినా, మరిన్ని అవకాశాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు మోనాల్‌కు హీరోయిన్‌ అవకాశాలు రాకపోవచ్చు కానీ… ఇలాంటి ఐటెం సాంగ్స్‌, అతిథి పాత్రలు తప్పకుండా వస్తాయ్‌. గతంలో నటిగా అంత పేరు తెచ్చుకోకపోయినా, అందంతో అలరించింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ తర్వాత కూడా ఆ అందమే అవకాశాలు తెచ్చిపెడుతోంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus