మోనాల్‌కు కౌంటర్స్‌… రోబోలకు మెడల్స్‌…

  • September 27, 2020 / 08:02 PM IST

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో మూడో వీకెండ్‌ వచ్చేసింది. గత వీకెండ్‌లో ఇంట్లో సీరియస్‌నెస్‌ లేదు. టాస్క్‌లు సరిగ్గా ఆడటం లేదు అంటూ అగ్గి మీద గుగ్గిలం అయిన నాగార్జున ఈ వారం కూల్‌గానే ఉన్నాడు. ‘ఉక్కు హృదయం’ టాస్క్‌లో అంత మసాలా వచ్చాక ఇంకేం అంటారు లెండి. ఈ వీకెండ్‌లో తొలి రోజు ఏం జరిగిందంటే? అఖిల్‌ – మోనాల్‌ – అభిజీత్‌ ట్రాయాంగిల్‌ స్టోరీలోకి గంగవ్వ ఎంటర్‌ అయ్యింది. మోనాల్‌ను ఏడిపించాలని కంకణం కట్టుకుంది.

అఖిల్‌తో మాట్లాడొద్దని మోనాల్‌కు చెప్పింది. మోనాల్‌ మాట్లాడితే.. అఖిల్‌ కరాబైపోతాడు అంటూ టీజ్‌ చేసింది గంగవ్వ. ఆమె తీరు చూస్తుంటే… ఈ ట్రయాంగిల్‌ స్టోరీలో గంగవ్వ ఇంకొంచెం మసాలా దట్టించేలా కనిపిస్తోంది. చూద్దాం నాలుగో వారం ఏం జరుగుతుందో? ‘స్మార్ట్‌ గేమ్‌’తో తమను అభిజీత్‌ బోల్తా కొట్టించిన విషయాన్ని మనుషుల టీమ్‌ ఇంకా మరచిపోలేదు. తనను ‘ఓల్డ్‌ థాట్స్’ అన్నాడని అమ్మ రాజశేఖర్‌ కోపం కంటిన్యూ చేస్తున్నాడు. కుమార్‌సాయి అయితే నేను ఇంట్లో ఉన్నంతవరకు అభిజీత్‌నే నామినేట్‌ చేస్తా అంటూ ఏవేవో కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు.

ఇంతగా అభిజీత్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో మరి. ఈసారి బిగ్‌బాస్‌ టైటిల్‌ మహిళలకే రావాలి అంటూ ఆరియానా, దేవీ నాగవల్లి చర్చ పెట్టుకున్నారు. ఇంట్రో వీడియోలో అదే విషయాన్ని చెప్పాం అంటూ గుర్తు చేసుకున్నారు. దేవీ నాగవల్లి అయితే ఏదో ట్రై చేస్తోంది. టాస్క్‌ల విషయంలో, పర్‌ఫార్మెన్స్‌ విషయంలో తన సత్తా చూపిస్తోంది. అప్పుడప్పు యాక్టివేట్‌ అయ్యే ఆరియానా… ఎప్పుడు ఫుల్‌ టైమ్‌ యాక్టివేట్‌ అవుతుందో… టైటిల్‌ గెలుస్తుందో చూడాలి.

* నామినేషన్‌లో ఉన్న ఏడుగురితో జంగా గేమ్‌ ఆడించారు. ఒక్కో బ్లాక్‌ను బయటకు తీసి… ఇంట్లో ఉన్న ఒకరి గురించి మనసులో మాట చెప్పాలి. అలా ఏడుగురు బ్లాక్స్‌ లాగి… నాగ్‌ అడిగినవారి గురించి వివరంగా చెప్పుకుంటూ వచ్చారు.

Click Here -> ట్రూత్‌ టవర్‌ గేమ్‌లో ఎవరి గురించి ఎవరేమన్నారంటే?

* ఈ వారం ఏడుగురు ఎలిమినేషన్ జోన్‌లో ఉండగా తొలుత ఎక్కువ ఓట్లు సాధించిన లాస్యను సేఫ్‌ చేశారు. ఆ తర్వాత మ్యాజిక్‌ టీ కప్‌లో మోనాల్‌ ఫొటో చూపించి ఆమెను సేవ్‌ చేశారు. ఈ పేరు రివీల్‌ చేసే కాన్సెప్ట్‌ ఏదో బాగుంది.

* ‘ఉక్కు హృదయం’ టాస్క్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ముగ్గురికి నాగార్జున మెడల్స్‌ ఇచ్చారు. మహా నటి, మహా నాయకుడు, మహా కంత్రి పేరుతో మూడు మెడల్స్‌ ఇచ్చారు.

Click Here -> ఎవరికి ఏ మెడల్‌ వచ్చిందంటే?

వీకెండ్‌లో నాగార్జున వచ్చి ఎలిమినేషన్‌ నుంచి సేఫ్‌ అయ్యేవాళ్ల వివరాలు చెప్పడం ఒక్కటే కాదు.. ఇంట్లోవాళ్ల గురించి ఆసక్తికర వివరాలు తెలిపేలా కొన్ని గేమ్స్‌ కూడా పెడుతుంటాడు. అలా ఈ శనివారం ‘బ్యాడ్‌’ టాస్క్‌ పెట్టాడు. అంటే హౌస్‌మేట్స్‌లో బ్యాడ్‌ క్వాలిటీని సహచరులతో చెప్పించారు.

Click Here -> ఎవరి గురించి ఎవరేం చెప్పారంటే?

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus