బోల్డ్ పాత్రలకు రెడీ.. కానీ ఐటెం సాంగ్స్ మాత్రం చెయ్యదట..!

Advertisement

‘బిగ్ బాస్4’ ద్వారా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. అంతకు ముందు అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ రాని క్రేజ్ ను.. ఈ షో ద్వారా సొంతం చేసుకుంది. అలా అని ఈమె బిగ్ బాస్ విన్నర్ కాలేదు. కనీసం టాప్ 5 లో కూడా నిలవలేదు. కానీ హౌస్ లో ఉన్నప్పుడు ఈమె తోటి హౌస్మేట్స్ అయిన అఖిల్, అభిజీత్ లతో రొమాన్స్ చెయ్యడం.. అలాగే ఎక్స్పోజింగ్ చెయ్యడంతో.. ఫ్యామిలీ ఆడియెన్స్ తిట్టుకున్నా.. కుర్ర కారు మాత్రం ఈమె గ్లామర్ కు ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్ ను వాడుకోవాలని ‘అల్లు అదుర్స్’ టీం ట్రై చేశారు.

ఈ చిత్రంలో మోనాల్ తో అదిరిపోయే ఐటెం సాంగ్ చేయించారు. అందుకు గాను ఈ అమ్మడికి 15లక్షల వరకూ పారితోషికం కూడా ఇచ్చారు. ఈ చిత్రంతో పాటు చాలా తెలుగు సినిమాల్లో మోనాల్ కు ఛాన్సులు వస్తుండడం అలాగే బుల్లితెర షోలలో కూడా మెంటర్ గా ఛాన్సులు దక్కడంతో ఈమె హైదరాబాద్ కు మకాం మార్చడానికి రెడీ అయిపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా మోనాల్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అదేంటంటే.. ఇక నుండీ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చెయ్యదట. ‘ఎంత గ్లామర్ షో అయినా చేస్తాను, బోల్డ్ పాత్రలకు అయినా రెడీ కానీ ఐటెం సాంగ్స్ మాత్రం చెయ్యను’ అని ఇటీవల ఈమెను సంప్రదించిన దర్శకనిర్మాతలకు చెప్పిందట. మోనాల్ ఇంత సడెన్ గా ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news