టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో ఉన్న స్టార్స్ ఎవరంటే..?

  • January 7, 2023 / 08:17 PM IST

గతకొద్ది రోజులుగా వివిధ భాషలకు చెందిన స్టార్స్ వరుసగా గుడ్ న్యూస్‌లు చెప్తున్నారు.. ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్.. ఇలాంటి శుభవార్తలను పరిశ్రమ వర్గాలు.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు.. ఇప్పటికే హన్సిక, నాగ శౌర్య వంటి సెలబ్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.. మరోవైపు బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, యంగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్ జంట పెళ్లి గురించిన వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి..

ఇక శర్వానంద్ పెళ్లిసందడి కూడా మొదలవనుంది.. ఈ నేపథ్యంలో తన ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. ఇటీవల బాలయ్య షోలో పాల్గొన్నప్పుడు పెళ్లెప్పుడనడిగితే ప్రభాస్ పేరు చెప్పి తప్పించుకున్నాడు కానీ ఎవరూ ఊహించని విధంగా గుడ్ న్యూస్ చెప్పి, షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ ఇచ్చాడు..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో శర్వాతో పాటు మరికొంత మంది హీరోలున్నారు.. ముప్పై దాటినా మ్యారేజ్ ముచ్చట చెప్పని ముదురు బెండకాయల లిస్టులో నుండి శర్వానంద్ పేరు తీసేసి.. అప్‌డేట్ చేస్తే.. ఎవరెవరున్నారనే వివరాలు ఇలా ఉన్నాయి..

1) ప్రభాస్

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే చిక్కు ప్రశ్నకి సమాధానం అయితే దొరికింది కానీ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లెప్పుడు? అంటే మాత్రం.. అది ఆయనకి కూడా తెలియదేమో అన్నంతగా మారిపోయింది.. బాలయ్య షోలో డార్లింగ్ చెప్పినట్టు సల్మాన్ ఖాన్ తర్వాత అనగలడేమో కానీ మన టాలీవుడ్‌లో మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచాడు 43 ఏళ్ల ప్రభాస్..

2) అడివి శేష్

వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ యాక్టర్ అంట్ టాలెంటెడ్ రైటర్ అడివి శేష్.. 37 సంవత్సరాల శేష్ ఇంకా సింగిల్‌‌గానే గడుపుతున్నాడు..

3) సాయి ధరమ్ తేజ్

36 ఏళ్ల సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనుకుంటున్నట్టున్నాడు.. అందుకే పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చినా కానీ రెస్పాండ్ కావడం లేదు..

4) రామ్ పోతినేని

ఉస్తాద్ రామ్ పోతినేని వయసు ప్రస్తుతం 34 ఏళ్లు.. ఇంకా గుడ్ న్యూస్ చెప్పట్లేదేంటని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

5) విజయ్ దేవరకొండ

33 సంవత్సరాల రౌడీ హీరో ప్రస్తుతం రష్మిక మందన్నతో రిలేషన్‌‌లో ఉన్నాడనే న్యూస్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికైతో నో పెళ్లి అంటున్నాడు విజయ్..

6) వరుణ్ తేజ్

32 ఏళ్ల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వార్తలొచ్చాయి కానీ కన్ఫామ్ చేయలేదు.. నాగబాబు కొడుకు కోసం మంచి సంబంధాలు చూస్తున్నారని అంటున్నారు.. వీరితో పాటు సుశాంత్, నవదీప్ వంటి యంగ్ హీరోల పేర్లు కూడా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో ఉన్నాయి..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus