గూగుల్ సెర్చ్ లో కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ స్థానాలేంటో తెలుసా?

  • December 8, 2022 / 11:37 AM IST

2022 సంవత్సరంలో 200 కంటే ఎక్కువ సినిమాలు థియేటర్లలో, ఓటీటీలలో విడుదల కాగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ ఏడాది ఎక్కువమంది గూగుల్ లో వెతికిన సినిమాల జాబితాలో బ్రహ్మాస్త్ర పార్ట్1 తొలి స్థానంలో ఉంది. బ్రహ్మాస్త్ర పార్ట్1 మూవీ ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.

బ్రహ్మాస్త్ర పార్ట్1 ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్1 ను మించి హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నా గూగుల్ సెర్చ్ లో మాత్రం తొలి స్థానం బ్రహ్మాస్త్రకే సొంతం కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్1 తర్వాత రెండో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ది కశ్మీర్ ఫైల్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.

ఆర్ఆర్ఆర్ మూవీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన కాంతార మూవీ ఐదో స్థానంలో నిలిచింది. పుష్ప ది రైజ్ మూవీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. విక్రమ్ సినిమా ఏడో స్థానంలో నిలవగా లాల్ సింగ్ చడ్డా సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. దృశ్యం2 సినిమా తొమ్మిదో స్థానంలో నిలవగా థోర్ లవ్ అండ్ థండర్ పదో స్థానంలో నిలిచింది.

టాప్ టెన్ జాబితాలో బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలే ఎక్కువగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. సౌత్ సినిమాలలో ఎక్కువ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus