Sitar Song: ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సాంగ్ ‘సితార్’.. ఎలా ఉందంటే?

  • July 10, 2024 / 06:26 PM IST

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja ) , హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో ‘షాక్’ (Shock) ‘మిరపకాయ్’ (Mirapakay) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘మిరపకాయ్’ మంచి సక్సెస్ అందుకుంది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్లో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) అనే సినిమా రూపొందుతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘రైడ్’ కి ఇది రీమేక్. అయినప్పటికీ హరీష్ శంకర్.. స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసినట్లు వినికిడి. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు.

వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహా నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతంలో రూపొందిన ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. తాజాగా ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేశారు. ‘సితార్’ అంటూ ‘మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్’ ని విడుదల చేయడం జరిగింది. ‘చిట్టిగువ్వ పిట్ట‌లాంటి చ‌క్క‌న‌మ్మా..’ అంటూ సాగిన ఈ పాటకి సాహితీ లిరిక్స్ అందించగా సాకేత్, సమీరా ఎంతో రొమాంటిక్ గా పాడారు.

మిక్కీ జె మేయర్ ట్యూన్ కూడా క్యాచీగా అనిపిస్తుంది. ఒక్కసారి వినగానే ఎక్కేసే విధంగానే ఈ పాట ఉంది. అయితే ‘లిరిక్స్ కొంచెం తేడాగొట్టినట్టు’ సోషల్ మీడియాలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అది పక్కన పెడితే.. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే..ల మధ్య రొమాన్స్ బాగా పండినట్టు కొన్ని విజువల్స్ చెబుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :


Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus