Mrunal Thakur: విజయ్ దేవరకొండ పై ఈ స్టార్ హీరోయిన్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు కాగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని ఈ హీరో ఖుషి సినిమాపై చాలా ఆశలు పెట్టుకోవడంతో పాటు ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు డైరెక్టర్ కావడం గమనార్హం.

పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో సమంత కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే విజయ్, మృణాల్ ఠాకూర్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా మృణాల్ విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలడని మృణాల్ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ యువతి విజయ్ తో చేసే సినిమా షూట్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు.

విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నానని అర్జున్ రెడ్డి, మహానటి సినిమాలలో గుర్తుండిపోయే పాత్రలలో విజయ్ నటించాడని ఆమె చెప్పుకొచ్చారు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు విజయ్ వన్నె తెస్తాడని ఎలాంటి పాత్రలోనైనా విజయ్ మెప్పించగలడని ఆ క్రేజ్ విజయ్ కు మాత్రమే సొంతమని మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పుకొచ్చారు. సౌత్ సినీ పరిశ్రమ నన్ను ఎంతో ఆదరిస్తోందని ఇక్కడ ఎంతోమంది నటులు ఉన్నారని ఆమె అన్నారు.

విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబో మూవీలో ఈ బ్యూటీ నటిస్తుండగా కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. గీతా గోవిందం, సర్కారు వారి పాట సినిమాలతో విజయాలను అందుకున్న పరశురామ్ తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus