కళ్యాణ్ కూతురు క్రిస్టియన్!

  • August 27, 2016 / 11:59 AM IST

కులమతాలకు అతీతంగా ఉంటామని చాలా మంది ఏదో పేరు కోసం చెప్పుకొంటుంటారు. కానీ చాలా తక్కువమంది దాన్ని ఫాలో అవుతుంటారు. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన మూడో భార్య అన్నా లేజ్నోవా రష్యాకు చెందిన స్త్రీ కావడంతో.. పెళ్లయ్యాక మతం మార్చేసుకొంటుందిలే అనుకొన్నారందరూ. అయితే.. “సర్దార్ గబ్బర్ సింగ్” సెట్ లో కళ్యాణ్ మూడో కూతురు కనపడగానే “ఏం పేరు పెట్టాడు” అని అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. అమ్మాయి పేరు “పోలెనా” అని తెలిసింది. దాంతో కొంతమంది హేటర్స్ ఖంగుతిన్నారు.

నేడు కళ్యాణ్ స్వయంగా.. “నా కూతురు క్రిస్టియన్” అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై అతడు కులమతాలకు అతీతంగా వ్యవహరించే విధానం పట్ల అందరికీ విశేషమైన అభిమానం పెల్లుబికింది. ఎంతైనా పవర్ స్టార్ కదండీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus