మాజీ భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..!

పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది చాలా మంది అంచనా వేయలేరు. డబ్బుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు.. మ్యారీడ్ లైఫ్ కూడా అందంగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. అందులో పూర్తిగా నిజం లేదు. జీవన అవసరతలు కొరకు డబ్బు అవసరం. అది కొంతవరకు మాత్రమే కరెక్ట్. కానీ పెళ్లి చేసుకున్న జంట కలిసుండాలి అంటే వారి మధ్య అభిప్రాయ బేధాలు అనేవి చోటు చేసుకోకూడదు. అవి పెళ్లి చేసుకున్న జంట మధ్యలో చోటు చేసుకోకపోయినా..

కుటుంబ సభ్యులకు ఇచ్చే ఆ జంట ఇచ్చే గౌరవ మర్యాదల విషయంలో తేడా వస్తే.. కచ్చితంగా అభిప్రాయ బేధాలు అనేవి చోటు చేసుకుంటాయి.. అది విడాకుల వరకు వెళ్లినా ఆశ్చర్య పడనవసరం లేదు అంటుంది కరిష్మా కపూర్. 1990ల నుండి 2000 వరకు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమెకు మ్యారేజ్ లైఫ్ కలిసి రాలేదు. 2003లో బిజినెస్ మెన్ సంజయ్ కపూర్ ని ఈమె పెళ్లి చేసుకుంది. అయితే.. వీరి వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో వీళ్ళ కాపురం ఎక్కువ కాలం సాగలేదు.

2016 లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. అంతేకాదు కరిష్మా తన అత్తమామల పై వరకట్నం కేసు కూడా పెట్టింది. ఇన్నాళ్లు తన విడాకుల గురించి ఎక్కువగా మాట్లాడని కరిష్మా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. అంతేకాదు తన భర్త, అత్తమామల పై కేసు పెట్టింది. కరిష్మా ఈ విషయం పై మాట్లాడుతూ.. “నాకు పెళ్ళైన కొత్తలో సంజయ్ తల్లి నాకు ఓ డ్రెస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. బాబు కియాన్ పుట్టాక..

ఆమె ఇచ్చిన డ్రెస్ ని మళ్ళీ వేసుకోమని కోరింది. డెలివరీ తర్వాత నేను లావు అయ్యాను. దీంతో ఆ డ్రెస్ వేసుకోవడం కుదరలేదు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాను. దీనికి ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అప్పుడు సంజయ్… ‘నన్ను లాగిపెట్టి కొట్టమని తన తల్లికి చెప్పాడు. అప్పుడు అతనికి నచ్చజెప్పాల్సింది పోయి.. సంజయ్ తల్లి అతన్ని మరింతగా రెచ్చగొట్టింది.ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది ’ అంటూ ఆమె ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus