బాహుబలి సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు

  • August 26, 2016 / 09:30 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మలిచిన వెండితెర అద్భుత శిల్పం బాహుబలి. భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచంలోని సినీ అభిమానులందరినీ అలరించింది. అంతే కాదు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే ప్రశ్నను వాళ్ల ముందు ఉంచింది. చిత్ర బృందాన్ని విలేకరులు ఎంత మంది అడిగినా దానికి సమాధానం బయటకు రాలేదు. చిత్రం విడుదలై ఏడాది గడుస్తున్నా ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుందామని ఆతృతగా గూగుల్ ని అడిగే వారి సంఖ్య తగ్గడం లేదు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఓ నిజం బయటికి వచ్చింది. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న సంగతి కట్టప్ప పాత్ర ధారి అయినా సత్య రాజ్ కే తెలియదంట.

ఇంకా ఆ సీన్ కూడా చిత్రీకరించలేదని తెలిసింది. ఈ రహస్యం కథ రచయిత విజయేంద్ర ప్రసాద్, డైరక్టర్ రాజమౌళి, కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మాత్రమే తెలుసని సమాచారం. మూడేళ్ల పాటు ఒక సీక్రెట్ ని దాచుకోవడం అంటే చాలా కష్టం. అందుకే ఆ విషయాన్ని రాజమౌళి ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాడని చిత్రం బృందం వెల్లడించింది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగానే కట్టప్ప పై కీలక  సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలిపింది. అప్పుడైనా ఆ సంగతి బయటికి వస్తుందో లేదో వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus