స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాకు మాత్రం పవన్ రెమ్యునరేషన్ ఏకంగా 60 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. రీఎంట్రీలో పవన్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
వకీల్ సాబ్ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజుకు బాగానే లాభాలు వచ్చాయి. వకీల్ సాబ్ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. హరీష్ శంకర్ మూవీకి పవన్ ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో రెమ్యునరేషన్ ను పెంచారని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. హరీష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారనే విషయం తెలిసిందే. పవన్ చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉండటంతో వేగంగా సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది పవన్ హీరోగా తెరకెక్కుతున్న మూడు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లలో పవన్ సినిమాలు రిలీజవుతాయని ఈ మూడు సినిమాలు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ తరువాత మూడు సినిమాలు వేర్వేరుగా 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మ