Jr NTR, Prashanth: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రూమర్లకు చెక్.. విధ్వంసం అప్పుడేనా?

  • October 6, 2023 / 03:38 PM IST

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్లలో ఒకటనే సంగతి తెలిసిందే. కొరటాల శివ తాజాగా దేవర2 సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఆలస్యం కావచ్చని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. ప్రశాంత్ నీల్ సలార్2 సినిమాకు సంబంధించి చేసిన ప్రకటన ఈ కన్ఫ్యూజన్ ను మరింత పెంచింది. అయితే వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పెడుతూ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 2024 సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలుకానుందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.

2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్1 రిలీజ్ కానుండగా ఒకే నెలలో తారక్ అభిమానులకు రెండు శుభవార్తలు అంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మైత్రీ నిర్మాతలు అధికారికంగా చేసిన ప్రకటన ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి వరుసగా అప్ డేట్లు వస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఎన్టీఆర్ వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలతో ఆ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లతో ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో తారక్ కనిపించనున్నారు. దేవర సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలు భారీ రేంజ్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండేలా ఎన్టీఆర్ ప్లాన్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలోని సాంగ్స్, బీజీఎం స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus