అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘నాంది’ ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం నరేష్ కు మంచి విజయాన్ని అందించింది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. మొదట తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆ తరువాత మంచి టాక్ ను సంపాదించుకోవడంతో..
ఎక్కువ థియేటర్లను దక్కించుకుంది. ఇక ఈ చిత్రం 12 డేస్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే :
నైజాం | 1.74 cr |
సీడెడ్ | 0.57 cr |
ఉత్తరాంధ్ర | 0.52 cr |
ఈస్ట్ | 0.38 cr |
వెస్ట్ | 0.27 cr |
గుంటూరు | 0.38 cr |
కృష్ణా | 0.41 cr |
నెల్లూరు | 0.23 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.10 cr |
ఓవర్సీస్ | 0.17 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.77 cr (షేర్) |
‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం. ఇక 12 రోజులు పూర్తయ్యేసరికి 4.77 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. రెండో మంగళవారం కూడా ఈ చిత్రం 0.14 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.85 కోట్ల ను కొల్లగొట్టింది.
Click Here To Read Movie Review
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!