Kalki: అసలైన అస్త్రాలను బయటకు తీస్తున్న నాగ్ అశ్విన్.. ఏం జరిగిందంటే?

  • May 29, 2024 / 03:31 PM IST

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇకపై అసలైన ఆయుధాలతో, అస్త్రాలతో కల్కి ప్రమోషన్స్ జరగనున్నాయని నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉన్న అప్ డేట్స్ తో మేకర్స్ రిలీజ్ సమయానికి అంచనాలను పెంచనున్నారని భోగట్టా. ఈ నెల 31వ తేదీన బుజ్జి, భైరవ పాత్రలకు సంబంధించిన ఒక వీడియో రిలీజ్ కానుంది.

టీజర్, ట్రైలర్ కు సంబంధించి కూడా వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో రాజమౌళి (S. S. Rajamouli) స్థాయి డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ సలార్ తర్వాత నటించి రిలీజవుతున్న సినిమా కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఈ మధ్య కాలంలో థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం కూడా కల్కికి ఎంతగానో కలిసొస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పుష్ప ది రూల్  (Pushpa 2)  విడుదలయ్యే వరకు కల్కి సినిమాకు పోటీ లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సైతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో దీపిక (Deepika Padukone) రోల్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

దిశా పటానీ (Disha Patani) ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ (Amitabh Bachchan), కమల్ (Kamal Haasan) పాత్రలు సైతం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాపై ఇతర భాషల్లో సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కల్కి సినిమా భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus