Hema: హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

  • May 27, 2024 / 07:18 PM IST

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ (Hema) కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కృష్ణవేణి అనే పేరుతో ఆమె ఆ పార్టీకి ఎన్రోల్ చేసుకుని ఎంట్రీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఇక విచారణకు హాజరు కావాలని హేమకి నోటీసులు పంపడం కూడా జరిగింది. అయితే ఆమె డుమ్మా కొట్టేసింది.మే 27 అంటే ఈరోజు ఆమె విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనారోగ్య సమస్యల వల్ల ఆమె హాజరు కాలేనని హేమ బెంగళూరు పోలీసులకు తెలిపిందట.

‘ఇప్పుడు నేను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాను. విచారణకి నాకు టైం కావాలి.’ అంటూ ఆమె బెంగళూరు పోలీసులకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరోపక్క హేమ ఇంకో వీడియో రిలీజ్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ” మనం ఏం దేవుళ్ళం కాదు. తప్పు జరిగితే హార్ట్ ఫుల్ గా సారీ చెప్పవచ్చు. అప్పుడు మనం ఫ్రెష్ గా ఉంటాం.. ఒక్క అబద్ధం చెబితే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాల్సి ఉంటుంది.

కాబట్టి 99.9 పర్సెంట్ అబద్ధాలు ఆడకుండా ఉండటం మంచిది. అందువల్లే నేను చాలా హ్యాపీగా ఉంటాను” అంటూ ఏంటేంటో చెప్పుకొచ్చింది. ఇదే టైంలో ఒక నెటిజెన్ ‘యు ఆర్ హాట్’ అని కామెంట్ పెట్టాడట. అందుకు ఆమె.. ‘నేను హాట్ గా ఎక్కడ ఉన్నాను రా..! నా మొహం చూడు పిచ్చిదానిలా ఉన్నాను. వేరే వాళ్ళు చూస్తే చేతిలో డబ్బులు వేసి వెళ్తారు’ అంటూ వెటకారంగా కామెంట్స్ చేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags