Rashmika , Anand Deverakonda: ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?

నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) పుష్ప ది రైజ్ (Pushpa) , యానిమల్ (Animal) సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ తో (Pushpa2) ఆ సినిమాలను మించిన విజయాన్ని అందుకుంటానని రష్మిక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన గం గం గణేశా (Gam Gam Ganesha) మూవీ ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కు రష్మిక అతిథిగా హాజరయ్యారు.

గతంలో బేబీ (Baby) సినిమా ప్రమోషన్స్ కోసం హాజరైన రష్మిక ఇప్పుడు గం గం గణేశా ఈవెంట్ కు హాజరై ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఒకింత అంచనాలు పెంచేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ  రష్మికతో రష్మిక పెట్ డాగ్, విజయ్ (Vijay Devarakonda) పెట్ డాగ్ ఫోటోలను చూపించి ఈ ఫోటోలలో ఏది ఫేవరెట్ అని అడిగారు. ఆ ప్రశ్నకు రష్మిక నా పెట్ డాగ్ ఆరా నా ఫస్ట్ బేబీ అని విజయ్ పెట్ డాగ్ స్మార్ట్ నా సెకండ్ బేబీ అని తెలిపారు.

ఆ తర్వాత నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని ఆనంద్ దేవరకొండ అడగగా రష్మిక మైక్ పక్కన పెట్టి మెల్లగా ఆనంద్ ను నీయబ్బ అంటూ సరదాగా తిట్టారు. ఆ తర్వాత మైక్ పట్టుకుని ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా అంటూ రష్మిక కామెంట్లు చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ అని రష్మిక అన్నారు. విజయ్, రష్మిక కాంబోలో మరో సినిమా రానుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ రష్మిక కాంబోలో సినిమా వస్తే ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు పుష్ప ది రూల్ నుంచి సెకండ్ సింగిల్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఈ పాటను పాడారని సమాచారం అందుతోంది. ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన పుష్ప ది రూల్ రిలీజ్ కానుండగా ఈ సినిమా నార్త్ అమెరికా రైట్స్ ఏకంగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus